Etela Rajender: హైదరాబాద్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుపై లోక్‌సభలో ఈటల ప్రశ్న

Etala Rajendar aska about skill development centre

  • లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ఈటల రాజేందర్
  • హైదరాబాద్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? అని ప్రశ్నించిన ఎంపీ
  • యువతకు బ్యాంకులు అవసరమైన లోన్లు ఇచ్చేలా చూడాలన్న ఈటల

హైదరాబాద్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ లోక్ సభలో ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ, అగ్రికల్చర్, డైరీ వంటి లైవ్ స్టాక్ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లైవ్ స్టాక్ పథకాలు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలు చేస్తున్నట్లు చెప్పారు.

భారతదేశంలో యువశక్తి చాలా ఎక్కువగా ఉందని, ఐటీ, తయారీ, సేవల రంగాల్లో పనిచేసేవారికి నాణ్యతతో కూడిన శిక్షణ ఇవ్వడానికి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? విదేశాలకు వెళ్లే పిల్లలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు ఏమిటి? అని ప్రశ్నించారు. పాస్‌పోర్టు తీసుకోవడం, వీసా రావడం నుంచి... మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించాలన్నారు.

విదేశాలకు వెళ్లే విద్యార్థులు ధృవీకరణ లేని కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ జైలుపాలు కాకుండా చూసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వివరించాలన్నారు. వికసిత్ భారత్-2047 కోసం ప్రధాన మంత్రి మోదీ ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం యువతకు బ్యాంకులు అవసరమైన లోన్లు ఇచ్చేలా చూడాలన్నారు.

  • Loading...

More Telugu News