BJP: బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుంది: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

- బడ్జెట్‌ను చూసి దేశ ప్రజలంతా సంతోషపడుతున్నారని వ్యాఖ్య
- 75 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి బడ్జెట్ రాలేదన్న పాయల్ శంకర్
- కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడాలని వ్యాఖ్య
బీఆర్ఎస్‌కు పట్టిన గతే త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూసి దేశ ప్రజలంతా సంతోషపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత 75 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి బడ్జెట్ రాలేదని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలు మొదట తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడాలని వ్యాఖ్యానించారు. కులగణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపించారని ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.