Sonu Sood: సీఎం చంద్రబాబును కలిసేందుకు ఏపీ సచివాలయానికి వచ్చిన సోనూ సూద్

Sonu Sood arrives AP Secretariat to meet CM Chandrababu

  • చంద్రబాబుతో భేటీ కానున్న సోనూ సూద్
  • ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్ లు విరాళంగా ఇవ్వనున్న సోనూ సూద్
  • ఈ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఏపీకి తిరిగొచ్చిన చంద్రబాబు

ప్రముఖ సినీ నటుడు, వ్యాపారవేత్త సోనూ సూద్ అమరావతిలోని ఏపీ సచివాలయానికి వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నారు. సోనూ సూద్ రాష్ట్ర ప్రభుత్వానికి అంబులెన్స్ లు విరాళంగా ఇవ్వనున్నారు. సోనూ సూద్ ఫౌండేషన్ ఈ అంబులెన్స్ లను అందించనుంది. 

కాగా, ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ్నించి నేరుగా ఆయన సచివాలయానికి బయల్దేరారు.

  • Loading...

More Telugu News