KP Chowdary: డ్రగ్స్ కేసు నిందితుడు, నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య

- గతంలో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు
- నిందితుడి ఉన్న కబాలి నిర్మాత కేపీ చౌదరి
- గోవాలో ఆత్మహత్యకు పాల్పడిన వైనం
- పాల్వంచలో ఉంటున్న తల్లికి సమాచారం అందించిన పోలీసులు
గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న నిర్మాత కేపీ చౌదరి (కృష్ణప్రసాద్ చౌదరి) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన గోవాలో బలవన్మరణం చెందినట్టు గుర్తించారు.
2023లో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కేపీ చౌదరి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్ర తెలుగు వెర్షన్ నిర్మాతల్లో కేపీ చౌదరి ఒకరు. కాగా, కేపీ చౌదరి మృతిపై ఆయన తల్లికి పోలీసులు సమాచారం అందించారు. కేపీ చౌదరి తల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉంటున్నారు.
కేపీ చౌదరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, కబాలి సినిమా నష్టాలతో ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.