Casting Couch: కమిట్మెంట్ అడిగినప్పుడే చెప్పుతో కొట్టుండాల్సింది.. నిర్మాత ముత్యాల రాందాస్

- నటి ఫాతిమా సనా షేక్ ఆరోపణలపై స్పందించిన నిర్మాత
- కోరికలు తీరిస్తేనే టాలీవుడ్ లో ఛాన్సులు అనడంపై అభ్యంతరం
- ఆ నిర్మాతపై ఫిర్యాదు చేయకుండా కామెంట్స్ చేయడమేంటన్న నట్టి కుమార్
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అనేది తప్పుడు ప్రచారమని నిర్మాత ముత్యాల రాందాస్ అన్నారు. నిర్మాతల కోరికలు తీరిస్తేనే ఛాన్సులు వస్తాయంటూ దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ చేసిన వ్యాఖ్యలపై రాందాస్ తీవ్రంగా స్పందించారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని, కమిటీలు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇండస్ట్రీలో ఏ మహిళకైనా ఎవరి కారణంగానైనా ఇబ్బంది కలిగినా, వేధింపులకు గురైనా కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఫాతిమా విషయానికి వస్తే.. సినిమాలో అవకాశం కోసం ఓ నిర్మాత తనను కమిట్మెంట్ అడిగారని ఆమె ఆరోపించారు. అలా అడిగినప్పుడే చెప్పుతో కొట్టుండాల్సిందని, ఆ తర్వాతైనా వేధింపుల కమిటీకి ఫిర్యాదు చేయాల్సిందని అన్నారు.
తెలుగు ఇండస్ట్రీపై అభాండాలు వేయడం సరికాదని నట్టి కుమార్ అన్నారు. కమిట్మెంట్ అడిగిన నిర్మాత పేరును బయటపెట్టాలని ఫాతిమాను డిమాండ్ చేశారు. నిర్మాతపై ఫిర్యాదు చేయకుండా మీడియా ముందు కామెంట్స్ చేయడమేంటని ఫైర్ అయ్యారు.
ఫాతిమా ఆరోపణలు..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలోనే క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని, ఓ సినిమా చర్చల కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ప్రముఖ నిర్మాత ఒకరు తనను కమిట్మెంట్ అడిగారని చెప్పారు. టాలీవుడ్‌లో రాణించాలన్నా, అవకాశాలు రావాలన్నా అన్నింటికి సిద్ధంగా ఉండాలని, ఏ పనైనా చేయాలని సదరు నిర్మాత చెప్పాడన్నారు. ఆయన మాటలు తనను చాలా బాధ పెట్టాయని ఆరోపించారు. దీంతో భయమేసి వెనుదిరిగి వచ్చేశానని ఫాతిమా చెప్పుకొచ్చారు.