Hindupur: హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీ

- హిందూపూర్ మున్సిపల్ ఛైర్మన్ గా రమేశ్ కుమార్
- ఓటింగ్ లో టీడీపీకి 23 ఓట్లు, వైసీపీకి 14 ఓట్లు
- రమేశ్ ను ఛైర్మన్ సీట్లో కూర్చోబెట్టిన ఎమ్మెల్యే బాలకృష్ణ
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో టీడీపీ జోరు మరింత పెరిగింది. తాజాగా హిందూపూర్ మున్సిపల్ ఛైర్మన్ పదవిని తెలుగుదేశం కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా రమేశ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమేశ్ ను హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అభినందించారు. రమేష్ ను ఛైర్మన్ సీట్లో బాలయ్య కూర్చోబెట్టారు. ఈ రోజు నిర్వహించిన ఓటింగ్ లో టీడీపీకి అనుకూలంగా 23 ఓట్లు వైసీపీ అభ్యర్థి వెంకటలక్ష్మికి 14 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి కూడా పాల్గొన్నారు.