YS Jagan: నేడు తాడేపల్లికి జగన్ .. రేపు ముఖ్య నేతలతో సమావేశం

- ఈ రోజు సాయంత్రం 5.20 గంటలకు బెంగళూరు నుంచి గన్నవరం చేరుకోనున్న జగన్
- రోడ్డు మార్గంలో 6.20 గంటలకు తాడేపల్లి నివాసానికి
- రేపు (4వ తేదీ) ముఖ్య నేతలతో సమావేశం కానున్న జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ రోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. ఈ రోజు సాయంత్రం తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామ పరిధిలో శ్రీ శ్రీనివాస కన్వెన్షన్‌లో జరిగే ఒక వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించనున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు బెంగళూరు యలహంక నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి వైఎస్ జగన్ .. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 3 గంటలకు చేరుకుంటారు. 3.45 గంటలకు విమానంలో బయలుదేరి 5.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6 గంటలకు కుంచనపల్లిలోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్‌కు చేరుకుంటారు. ఇక్కడ సూర్యప్రతాప్ రెడ్డి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. తదుపరి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.20 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు.
చంద్రబాబు ప్రభుత్వం విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న వైసీపీ పీజు పోరు ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫీజు పోరుతో పాటు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు వైఫల్యాలపైన చేపట్టాల్సిన ఆందోళనల నిర్వహణపై రేపు (4వ తేదీ) ముఖ్య నేతలతో జగన్ చర్చించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.