Crime News: విడాకులు కోరిన భార్య.. ఆమె ప్రైవేటు వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టిన భర్త!

Man posts wife private videos online after she seeks divorce

  • గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘటన
  • ఏడాది క్రితమే వివాహం.. అంతలోనే విభేదాలు
  • కలిసి ఉండటం సాధ్యం కాదని విడాకులు కోరిన భార్య
  • కోపంతో ఆమె ప్రైవేటు వీడియోలు, ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన భర్త

భార్య విడాకులు డిమాండ్ చేయడాన్ని తట్టుకోలేకపోయిన భర్త ఆమె ప్రైవేటు వీడియోను ఆన్‌లైన్‌లో పోస్టు చేశాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఈ జంటకు ఏడాది క్రితమే వివాహమైంది. అయితే, ఆ తర్వాత కొంతకాలం నుంచే వీరి మధ్య విభేదాలు పొడసూపడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆమె తిరిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది.

ఇక కలిసి ఉండటం సాధ్యం కాదని భావించిన ఆమె (21) విడాకులు తీసుకుందామని ప్రతిపాదించింది. ఇది భర్తకు ఆగ్రహం తెప్పించింది. ఆమెపై కక్ష తీర్చుకోవాలని భావించి ఆమె ప్రైవేటు ఫొటోలు, వీడియోలను అసభ్య కామెంట్లతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఇద్దరూ ఉపయోగిస్తుండటంతో ఆ వీడియోలు ఆమె కంటపడ్డాయి. వాటిని చూసి నిర్ఘాంతపోయింది. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News