Naga Chaitanya: బుజ్జి తల్లి పాట శోభితకు అంకితం: నాగ చైతన్య

naga chaitanya about sobhita dhulipala

  • హైదరాబాద్‌లో తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • తన అర్ధాంగి శోభితను బుజ్జి తల్లి అని పిలుస్తుంటానన్న నాగచైతన్య
  • సినిమాలోని బుజ్జి తల్లి పాటను శోభితకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్న చైతన్య

నాగ చైతన్య హీరోగా చందూ మొందేటి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం 'తండేల్' ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిన్న రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 
 
ప్రీ రిలీజ్ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ, 'తండేల్‌' సినిమాలోని 'బుజ్జి తల్లి' పాట విడుదలైన తర్వాత తన అర్ధాంగి శోభిత ఆనందం వ్యక్తం చేసిందని అన్నారు. శోభితను తాను ముద్దుగా బుజ్జి తల్లి అని పిలుచుకుంటానని, ఆ పేరుతో పాట రావడంతో ఆమె సంతోషించిందని తెలిపారు. అంతేకాకుండా, 'బుజ్జి తల్లి' పాటను తన అర్ధాంగి శోభితకు అంకితం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  

ఇక ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయకగా నటిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన కొందరు మత్స్యకారులు పాకిస్థాన్ కోస్ట్ గార్డ్సు‌కు పట్టుబడి జైలు శిక్ష అనుభవించిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.   

  • Loading...

More Telugu News