Kachidi Fish: కాకినాడ మత్స్యకారుల వలలో కచిడి చేప.. రూ. 3.95 లక్షలకు కొనుగోలు.. దీనికి ఎందుకంత ధర?

Kachidi fish that sold about 4 lakh rupees

  • కుంభాభిషేకం రేవులో విక్రయించిన జాలర్లు
  • ఔషధ గుణాలు పుష్కలంగా ఉండటంతో భారీ డిమాండ్
  • చేపలోని ప్రతీ భాగమూ విలువైనదే

కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప వారికి కాసుల వర్షం కురిపించింది. 25 కిలోలు ఉన్న ఈ చేపకు దాదాపు రూ. 4 లక్షల ధర పలికింది. కచిడి చేపలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ చేపలకు భారీ డిమాండ్ ఉంటుంది. తమకు దొరికిన చేపను మత్స్యకారులు కుంభాభిషేకం రేవులో విక్రయించగా ఓ వ్యాపారి దానిని రూ. 3.95 లక్షలకు కొనుగోలు చేశాడు.

సాధారణంగా గోదావరి నదిలో దొరికే పులస చేపలకు ఎంత డిమాండ్ ఉంటుందో.. అంతకుమించిన డిమాండ్ కచిడి చేపకు ఉంటుంది. రుచిలో పులస చేపను మించింది లేకపోవడంతో దానికోసం ఎంత ధర చెల్లించేందుకైనా పోటీపడుతుంటారు. అయితే, కచిడి చేపలో మాత్రం ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తోనే తయారు చేస్తారని చెబుతారు. ఈ చేపలోని ఒక్కో భాగానికి ఒక్కో రేటు ఉంటుంది. దీని పొట్ట భాగాన్ని బలానికి వాడే మందుల్లో ఉపయోగిస్తారు. ఇంకా మరెన్నో ఔషధ గుణాలు ఉండటంతోనే ఈ చేపకు అంత డిమాండ్. ఇవి బంగారు వర్ణంలో ఉండటంతో వీటిని గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తారు.

  • Loading...

More Telugu News