Mudragada Padmanabham: ట్రాక్టర్‌తో ముద్రగడ ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లిన యువకుడు

Man attacked Mudragada Padmanabha Reddy house with tractor

  • తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంటి ఆవరణలోకి యువకుడు
  • కారును ఢీకొట్టి పూలకుండీలు, ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వైనం
  • మళ్లీ వచ్చి వీరంగం.. దేహశుద్ధి చేసిన ముద్రగడ అనుచరులు

మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసం వద్ద నిన్న ఓ యువకుడు ట్రాక్టర్‌తో హల్‌చల్ చేశాడు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని గజపతినగరానికి చెందిన గనిశెట్టి గంగాధర్ నిన్న తెల్లవారుజామున 4 గంటల సమయంలో ట్రాక్టర్‌తో ముద్రగడ ఇంటి ఆవరణలోకి వచ్చి కారు, ఫ్లెక్సీలు, పూలకుండీలను ఢీకొట్టి పరారయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే మళ్లీ వచ్చి కేకలు వేశాడు. దీంతో అతడిని పట్టుకున్న ముద్రగడ అనుచరులు దేహశుద్ధి చేశారు. విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, మద్యం మత్తులో ఏం చేస్తున్నానో తెలియకుండా ప్రవర్తించానని విచారణలో గంగాధర్ పోలీసులకు తెలిపాడు. మాజీ మంత్రులు కన్నబాబు, వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా తదితరులు విషయం తెలిసి ముద్రగడను పరామర్శించారు. కాగా, తండ్రి ఇంటి వద్ద జరిగిన ఈ ఘటనను ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి ఖండించారు.

  • Loading...

More Telugu News