Honda City: హోండా సిటీ కారు కొత్త వెర్షన్ ఇదిగో!

Honda City Apex Limited Edition car details

  • అపెక్స్ లిమిటెడ్ ఎడిషన్ కారు తీసుకువచ్చిన హోండా కార్స్ ఇండియా
  • ఇటీవల ఢిల్లీలో గ్లోబల్ ఎక్స్ పోలో ప్రదర్శన
  • అధునాతన ఫీచర్లతో కొత్త వెర్షన్  

భారత మార్కెట్లో సెడాన్ సెగ్మెంట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కారు... హోండా సిటీ. జపనీస్ దిగ్గజం హోండా సంస్థ తాజాగా తన సిటీ మోడల్ కు కొత్త వెర్షన్ తీసుకువచ్చింది. హోండా కార్స్ ఇండియా సంస్థ సిటీ అపెక్స్ లిమిటెడ్ ఎడిషన్ కారును పరిచయం చేసింది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఆటో ఎక్స్ పో వేదికగా హోండా సిటీ అపెక్స్ లిమిటెడ్ ఎడిషన్ కారును ఆవిష్కరించారు. 

ఈ కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే... దీంట్లో 1.5 లీటర్ ఐ-వీటెక్ ఇంజిన్ పొందుపరిచారు. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్... 7 స్టెప్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉన్నాయి.

లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన అడాస్, 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 6 ఎయిర్ బ్యాగ్ లు, లేన్ వాచ్ కామ్, లైట్ బ్రౌన్ కలర్ స్పెషల్ ఎడిషన్ సీట్ కవర్లు, సెవెన్ కలర్స్ లైటింగ్ థీమ్ (రిథమిక్ యాంబియెంట్ లైటింగ్), ప్రత్యేకంగా అపెక్స్ ఎడిషన్ బ్యాడ్జింగ్ దీంట్లోని ప్రత్యేకతలు. 

ఇందులో మిడ్ వి ట్రిమ్ ఎక్స్ షోరూమ్ ధర రూ.13.30 లక్షలు కాగా... టాప్ వేరియంట్ (వీఎక్స్) ఎక్స్ షోరూమ్ ధర రూ.15.62 లక్షలు.

  • Loading...

More Telugu News