Game changer: 'గేమ్‌ ఛేంజర్‌' తొలిరోజు కలెక్షన్‌ పోస్టర్‌ గురించి దిల్‌ రాజు ఏమన్నాడో తెలుసా?

Do you know what Dil Raju said about the first day collection poster of Game Changer

  • 'గేమ్‌ ఛేంజర్‌' వసూళ్లపై స్పందించిన 'దిల్‌'రాజు 
  • పంపిణీదారులతో ప్రెస్‌మీట్‌ పెట్టిన 'దిల్‌' రాజు 
  • 'సంక్రాంతికి వస్తున్నాం'  చిత్రం లాభాల పట్ల ఆనందం వ్యక్తం చేసిన పంపిణీదారులు

రామ్‌చరణ్‌, కియారా అద్వానీ జంటగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనను దక్కించుకుంది. ఈ సినిమాపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా విడుదలైన మరుసటి రోజు ఈ చిత్రం వసూళ్లపై విడుదల చేసిన పోస్టర్‌ చాలా విమర్శలకు గురైంది. ముఖ్యంగా... వచ్చిన కలెక్షన్స్‌కు సంబంధం లేకుండా కలెక్షన్ల పోస్టర్‌ వదిలారంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్ ఎదురయ్యాయి. 

కాగా ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్‌ రాజు నిర్మించిన మరో చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేష్‌, ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి ముఖ్య తారలుగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా సంక్రాంతికి విడుదలైంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందింది. అయితే ఈ చిత్రం తమకు అందించిన లాభాలు తెలియజేయడానికి, ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు శనివారం ఓ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్‌ రావిపూడి విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 

ఈ సందర్భంగా ''గేమ్‌ ఛేంజర్‌ తొలి రోజు వచ్చిన కలెక్షన్స్‌పై మీరు విడుదల చేసిన పోస్టర్‌.. మీరు విడుదల చేసిందా? లేక ఇంకా ఎవరైనా మీడియాకు పంపించారా?" అని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు దిల్ రాజు ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దిల్‌ రాజు  మాట్లాడుతూ ''మాకు వీక్‌నెస్‌లు ఉంటాయన్న సంగతి మీకు తెలుసు కదా. ఈ విషయంలో నేను మాట్లాడలేను. మాకు వీక్‌నెస్‌, అబ్లిగేషన్స్‌ ఉంటాయని  కమిట్‌ అవుతున్నాం" అంటూ సమాధానం చెప్పారు. 

"ఇప్పుడు అన్ని ఏరియాలో సినిమాలను పంపిణీ చేసే పంపిణీదారులు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉన్నారు. కానీ ఈ సినిమా సక్సెస్‌ విషయంలో పంపిణీదారులు అందరూ హ్యాపీగా ఉన్నారు" అని ఓ ప్రశ్నకు సమాధానంగా దిల్‌ రాజు చెప్పారు.

 నెల్లూరు జిల్లాకు తాను  1 కోటి 60 లక్షలు పెట్టి కొన్నానని, కేవలం రెండు రోజుల్లోనే తాను  రికవరీని చూశానని, ఈ సినిమా తమ ఏరియాలో తాను  పెట్టిన రేటుకు నాలుగొందల శాతం ఎక్కువగా కలెక్ట్‌ చేసిందని డిస్ట్రిబ్యూటర్‌ హరి తెలిపారు. 

  • Loading...

More Telugu News