Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్... ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

- లాభ, నష్టాల మధ్య కదలాడిన సూచీలు
- 5 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 26 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఈ ఉదయం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభమయింది. ఆ తర్వాత సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. లాభ, నష్టాల మధ్య సూచీలు కదలాడాయి. చివరకు ఫ్లాట్ గా ముగిశాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 5 పాయింట్ల లాభంతో 77,505 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 23,482 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జొమాటో (7.17%), మారుతి (4.98%), ఐటీసీ హోటల్స్ (4.71%), ఐటీసీ (3.33%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.96%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.71%), ఎల్ అండ్ టీ (-3.36%), ఎన్టీపీసీ (-2.04%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.03%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.87%).