Encounter: ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్

- ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్
- ఎనిమిది మంది మావోలు హతం
- కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
కొంతకాలంగా మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కాల్పుల మోతతో అటవీప్రాంతం హోరెత్తింది. బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు ప్రకటించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.