Thangalaan Movie: చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ మూవీకి అరుదైన గౌరవం

- విక్రమ్, పా. రంజిత్ కాంబోలో ‘తంగలాన్’
- గతేడాది ఆగస్టు 15న రిలీజైన మూవీకి హిట్ టాక్
- తాజాగా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కాబోతున్న చిత్రం
- రాటర్‌డామ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారంటూ డైరెక్టర్ ట్వీట్
చియాన్ విక్రమ్ హీరోగా ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం తంగలాన్. గతేడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో చాలా రోజుల తర్వాత విక్రమ్‌కు హిట్ దక్కింది. తాజాగా ఈ చిత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
నేడు ఈ మూవీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కాబోతుంది. నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న రాటర్‌డామ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా డైరెక్టర్ కట్‌ను ప్రదర్శించబోతున్నట్లు దర్శకుడు పా.రంజిత్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. తమ చిత్రానికి దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.