President: రాష్ట్రపతికి బడ్జెట్ అందజేసిన నిర్మలా సీతారామన్

- బడ్జెట్ విశేషాలను ద్రౌపది ముర్ముకు వివరించిన కేంద్ర మంత్రి
- పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి రాష్ట్రపతి అనుమతి
- కేంద్రమంత్రికి స్వీటు తినిపించిన రాష్ట్రపతి ముర్ము
పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఉదయం అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన కేంద్రమంత్రి.. బడ్జెట్ ను రాష్ట్రపతికి అందజేశారు. బడ్జెట్ లోని కీలక వివరాలను వివరించి పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి అనుమతి కోరారు. బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అనుమతిస్తూ రాష్ట్రపతి ముర్ము కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు స్వీటు తినిపించారు. రాష్ట్రపతితో సమావేశం ముగిసిన తర్వాత ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర మంత్రి పార్లమెంట్ కు చేరుకున్నారు. మరికాసేపట్లో లోక్ సభలో కేంద్ర మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు.
