Udit Narayan: ప్ర‌ముఖ గాయ‌కుడు ఉదిత్ నారాయ‌ణ్ మ‌హిళా అభిమానుల‌తో అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌.. వీడియో వైర‌ల్‌!

Udit Narayan Kisses Female Fans While Singing Tip Tip Barsa Paani At Event Netizens Call Him Tharki

  • ముంబ‌యిలో సీనియ‌ర్ సింగ‌ర్ మ్యూజిక్ క‌న్స‌ర్ట్‌
  • త‌న‌తో సెల్ఫీలు దిగిన ఫ్యాన్స్‌కు ముద్దులు పెట్టిన ఉదిత్ నారాయ‌ణ్
  • నెట్టింట వీడియో వైర‌ల్.. గాయ‌కుడి తీరుపై నెటిజ‌న్ల ఆగ్ర‌హం

ప్ర‌ముఖ గాయ‌కుడు ఉదిత్ నారాయణ్ మ‌హిళా అభిమానుల‌తో అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ముంబ‌యిలో జ‌రిగిన ఓ క‌న్స‌ర్ట్‌లో సీనియ‌ర్ సింగ‌ర్ త‌న‌తో సెల్ఫీలు దిగిన ఫ్యాన్స్‌కు ముద్దులు పెట్టారు. సెల్ఫీలు ఇస్తూ మ‌హిళా అభిమానుల‌ను కిస్ చేయ‌డం వీడియోలో ఉంది. 

ఉదిత్ నారాయణ్ ఈ క‌న్స‌ర్ట్‌లో 'టిప్ టిప్ బర్సా పానీ' అనే పాట‌ను ఆల‌పించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌తో సెల్ఫీలు తీసుకోవడానికి మ‌హిళా అభిమానులు వేదికకు దగ్గరకు వెళ్లారు. ఆయ‌న‌ వేదికపై పాట పాడుతూనే వారి దగ్గరికి వెళ్లి సెల్ఫీలు దిగారు. ఈ క్ర‌మంలోనే ఉదిత్ నారాయణ్ ముగ్గురు మహిళా అభిమానుల బుగ్గలపై ముద్దు పెట్టారు. 

ఆయ‌న అలా ఒక్క‌సారిగా ముద్దులు పెట్ట‌డంతో ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. అంత‌టితో ఆగ‌కుండా ఓ అభిమాని పెదవులపై కూడా ఆయ‌న‌ ముద్దు పెట్ట‌డం వీడియోలో చూడొచ్చు. ఈ క‌న్స‌ర్ట్ తాలూకు వీడియో బ‌య‌ట‌కు రావ‌డం, అది కాస్త‌ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయ‌న‌ ఇబ్బందుల్లో పడ్డారు.

ఉదిత్ నారాయణ్ మ‌హిళా అభిమానుల‌తో ప్ర‌వ‌ర్తించిన‌ తీరుపై నెటిజన్లు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. ఆయ‌న‌కు ఇలాంటివి కొత్తేం కాద‌ని, గ‌తంలోనూ ఇలాగే ప్ర‌వ‌ర్తించార‌ని కామెంట్లు చేస్తున్నారు. "ఇది అసహ్యకరం. క్యా తర్కీ ఆద్మీ హై యార్" అని ఒకరు, "ఉదిత్ నారాయణ్ ది లెజెండ్ కూడా ఉడిత్ నారాయణ్ ది గ్రేట్ తార్కి అని అనుకోలేదు..!'' అని మరొకరు వ్యాఖ్యానించారు. అయితే, తన చర్యలపై నెటిజన్లు చేసిన వ్యాఖ్యలపై ఉదిత్ నారాయణ్ ఇంకా స్పందించలేదు.

More Telugu News