Stock Market: కేంద్ర ఆర్థిక సర్వే ఎఫెక్ట్... భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

- వరుసగా నాలుగోరోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- 740 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 258 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
కేంద్ర ఆర్థిక సర్వే నివేదిక భారత స్టాక్ మార్కెట్ కు మాంచి ఊపును అందించింది. రేపు బడ్జెట్ ప్రకటించనున్న నేపథ్యంలో, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. దేశ జీడీపీ 2025-26 సంవత్సరానికి 6.8 శాతానికి చేరనుందని నివేదికలో పేర్కొన్నారు. కేంద్రం ప్రకటనతో స్టాక్ మార్కెట్ సూచీలు కదం తొక్కాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 740 పాయింట్లు పెరిగి 77,500 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 258 పాయింట్లు లాభపడి 23,508 వద్ద స్థిరపడింది. వరుసగా నాలుగో రోజు భారత స్టాక్ మార్కెట్ సూచీలు కళకళలాడాయి.
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాక్ షేర్లు లాభాల బాటలో పయనించగా... ఎయిర్ టెల్, ఐటీసీ హోటల్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాలు చవిచూశాయి.
గృహోపకరణాల రంగంలోని కంపెనీలు 2.09 శాతం వృద్ధితో నేటి ట్రేడింగ్ లో ముందంజ వేశాయి. ఆటోమొబైల్, రియాల్టీ, చమురు, ఎఫ్ఎంసీజీ షేర్లు 1 శాతం పెరిగాయి. ఇక... ఐటీ, మెటల్, మీడియా స్టాక్స్ ఫ్లాట్ గా ముగిశాయి.