N.Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ పొడిగించిన ఏపీ ప్రభుత్వం

- అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘన వ్యవహారం
- సంజయ్ పై మే 31 వరకు సస్పెన్షన్ పొడిగింపు
- విచారణ కమిటీ సిఫారసు మేరకు నిర్ణయం
గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ పై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ విధించడం తెలిసిందే. ఇప్పుడా సస్పెన్షన్ ను పొడిగించారు. సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ ను మే 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సంజయ్ అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఆయనపై సస్పెన్షన్ ను మరో 4 నెలలు పొడిగించారు. సంజయ్‌పై వచ్చిన అభియోగాలపై ఏర్పాటైన విచారణ కమిటీ సిఫారసులతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై వచ్చిన అభియోగాల మేరకు గతేడాది డిసెంబరు 3న సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చారు.
అటు, ఏసీబీ కేసులో సంజయ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించడం తెలిసిందే. ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.