Women's U19 T20 WC: అండ‌ర్‌-19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌... ఫైన‌ల్‌కి దూసుకెళ్లిన భార‌త అమ్మాయిలు!

IND WMN U19 won by 9 Wickets Womens U19 T20 WC

  • ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీస్‌లో టీమిండియా ఘ‌న‌ విజ‌యం 
  • ఇంగ్లిష్ జ‌ట్టు నిర్దేశించిన 114 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సింపుల్‌గా ఛేదించిన‌ భార‌త్‌
  • రాణించిన ఓపెన‌ర్లు గొంగ‌డి త్రిష (35), క‌మ‌లిని (56 నాటౌట్‌) 
  • ఫైన‌ల్‌లో ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నున్న భార‌త అమ్మాయిలు

మలేసియాలో జ‌రుగుతున్న మ‌హిళ‌ల అండ‌ర్‌-19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భార‌త అమ్మాయిలు అద‌ర‌గొట్టారు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీస్‌లో ఘ‌న‌ విజ‌యం సాధించి ఫైన‌ల్‌కి దూసుకెళ్లారు. ఇంగ్లీష్ జ‌ట్టు నిర్దేశించిన 114 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమిండియా కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి, ఇంకా 30 బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించింది. 

భార‌త జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్లు తెలుగమ్మాయిగొంగ‌డి త్రిష (35), క‌మ‌లిని (56 నాటౌట్‌) మ‌రోసారి బ్యాట్ ఝుళిపించారు. ఈ ద్వ‌యం తొలి వికెట్‌కు ఏకంగా 60 ప‌రుగులు భాగ‌స్వామ్యం అందించింది. త్రిష ఔటైన త‌ర్వాత క‌మిలిని ఇంగ్లండ్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డింది. 47 బంతుల్లో 7 బౌండ‌రీ సాయంతో అర్ధ‌శ‌త‌కం నమోదు చేసింది. చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిల‌బ‌డి భార‌త్‌ను గెలిపించింది. 

అంత‌కుముందు టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 113 ప‌రుగులే చేసింది. ఓపెన‌ర్ పెర్రిన్ 45, కెప్టెన్ నోర్‌గ్రోవ్ 30 ప‌రుగుల‌తో రాణించ‌గా మిగ‌తా బ్యాట‌ర్లు విఫ‌ల‌మ‌య్యారు. దాంతో ఆ జ‌ట్టు 113 ప‌రుగుల స్వ‌ల్ప స్కోరుకే ప‌రిమిత‌మైంది. 

భార‌త బౌల‌ర్ల‌లో ప‌రునిక సిసోడియా, వైష్ణ‌వి శ‌ర్మ చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా... ఆయుషి శుక్లా రెండు వికెట్లు తీసింది. త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 21 ప‌రుగులే ఇచ్చి 3 వికెట్లు సాధించిన సిసోడియాకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. కాగా, ఫైన‌ల్‌లో ద‌క్షిణాఫ్రికాతో భార‌త అమ్మాయిలు త‌ల‌ప‌డ‌నున్నారు.  

  • Loading...

More Telugu News