Gold Rates: హైదరాబాద్లో రూ. 84 వేలు దాటిన బంగారం

పెళ్లిళ్ల సీజన్ మొదలైన వేళ బంగారం ధరలు అడ్డుఅదుపు లేకుండా పరుగులు పెడుతున్నాయి. ఇటీవలే పది గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ. 80 వేలకు చేరుకుంది. ఇప్పుడు మరింత పెరిగి ఆల్ టైం హై నమోదు చేసింది. నిన్న 10 గ్రాముల మేలిమి బంగారం ధర తొలిసారి రూ. 84 వేలు దాటింది.
హైదరాబాద్లో గత రాత్రి 11 గంటల సమయానికి 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 84,500గా ట్రేడ్ అయింది. వెండి ధర కిలో రూ. 95,400గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర గురువారం ఔన్సుకు 40 డాలర్లకు పైగా పెరిగి 2,793 డాలర్లకు చేరుకుంది. వెండి ధర కూడా కిలోకు 26 డాలర్లు పెరిగి 1,014 డాలర్లకు చేరింది.