Poonam Pandey: కుంభ‌మేళాకు వెళ్లిన ప్ర‌ముఖ హీరోయిన్‌.. నా పాపాలన్నీ కొట్టుకుపోయాయ‌ని పోస్టు!

Poonam Pandey at Mahakumbh Mela in Prayagraj

  • యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌లో మ‌హా కుంభ‌మేళా
  • త్రివేణి సంగ‌మంలో ప‌విత్ర స్నానాల కోసం భారీగా త‌ర‌లివ‌స్తున్న భ‌క్తులు
  • ఇప్ప‌టికే కుంభ‌మేళాకు ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు
  • తాజాగా కుంభ‌మేళాకు వెళ్లిన హీరోయిన్ పూన‌మ్ పాండే
  • పవిత్ర స్నానం ఆచరిస్తున్న ఫొటోల‌ను పంచుకున్న న‌టి  

యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న‌ మహా కుంభమేళాలో త్రివేణి సంగమంలో ప‌విత్ర‌ స్నానం ఆచ‌రించ‌డం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయనేది భ‌క్తుల న‌మ్మ‌కం. అందుకే సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ పుణ్యస్నానాన్ని ఆచరిస్తున్నారు. ఇప్ప‌టికే బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని, దర్శకుడు కబీర్ ఖాన్, హాస్యనటుడు సునీల్ గ్రోవర్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, మరాఠీ దర్శకుడు ప్రవీణ్ తర్దే వంటి ప్రముఖులు ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానం చేశారు. 

ఇప్పుడు బాలీవుడ్‌ వివాదాస్పద నటి పూనమ్ పాండే కూడా ఈ జాబితాలో చేరారు. ఎప్పుడూ బోల్డ్ ఫొటోస్, కామెంట్ల‌తో వార్తల్లో ఉండే పూనమ్ తాజాగా ప్రయాగ్‌రాజ్‌కి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో త్రివేణి సంగమం‌లో పవిత్ర స్నానం ఆచరిస్తున్న ఫొటోల‌ను పంచుకున్నారు. ఈ ఫొటో క్యాప్షన్ గా ‘నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి’ అని రాశారు. పూనమ్ పాండే షేర్ చేసిన ఈ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

"నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి. జీవితాన్ని చాలా ద‌గ్గ‌ర‌గా చూశా. ఇక్క‌డ 70ఏళ్ల వృద్ధుడు చెప్పులేకుండా గంట‌ల త‌ర‌బ‌డి న‌డుస్తాడు. ఇక్క‌డ విశ్వాసానికి హ‌ద్దులు లేవు. కుంభ‌మేళాలో త‌మ ప్రాణాలు కోల్పోయిన వారికి మోక్షం దొరుకుతుంద‌ని ఆశిస్తున్నా. ఇక్క‌డి భ‌క్తి న‌న్ను మూగ‌బోయేలా చేసింది" అని పూన‌మ్ పాండే త‌న్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఇప్పుడు ఆమె పోస్టు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుండ‌గా.. నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 

ఇక 45 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న మ‌హా కుంభ‌మేళాలో బుధ‌వారం నాటికే 27 కోట్ల మంది ప‌విత్ర స్నానాలు ఆచ‌రించిన‌ట్లు యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ నెల 13న ప్రారంభ‌మైన ఈ కుంభ‌మేళా ఫిబ్ర‌వ‌రి 26 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. సుమారు 40కోట్ల మంది వ‌ర‌కు భ‌క్తులు త‌ర‌లి వ‌స్తార‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. 

కాగా, ఈ మ‌హా కుంభ‌మేళాలో బుధ‌వారం తెల్ల‌వారుజామున తొక్కిస‌లాట జ‌రిగిన‌ విష‌యం తెలిసిందే. మౌని అమావాస్య సంద‌ర్భంగా కోట్లాది మంది భ‌క్తులు ఒకేసారి త‌ర‌లిరావ‌డంతో సంగం ఘాట్ వ‌ద్ద జ‌రిగిన‌ తొక్కిస‌లాట‌లో 30 మంది ప్రాణాలు కోల్పోవ‌డం విచారకరం. 

View this post on Instagram

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

  • Loading...

More Telugu News