Viral Videos: ఉద్యోగుల‌కు చైనా కంపెనీ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ప్ర‌పంచంలో ఏ సంస్థ ఇలాంటి బోన‌స్ ఇచ్చి ఉండ‌దు!

Take As Much As You Can Count Chinese Company Offers Rs 70 Crore Bonus To Employees

      


ఉద్యోగుల‌కు బోన‌స్ ఇచ్చే విష‌యంలో ఓ కంపెనీ కాస్తంత వెరైటీగా ఆలోచించింది. చైనాకు చెందిన‌ హెస‌న్ మైనింగ్ క్రేన్ కో. లిమిటెడ్‌ అనే సంస్థ ఇలా త‌న ఉద్యోగుల కోసం వినూత్న నిర్ణ‌యం తీసుకుంది. 70మీట‌ర్ల పొడ‌వు ఉన్న ఓ టేబుల్ మీద రూ. 70కోట్లు ప‌రిచింది. ఆపై సంస్థ‌లోని ఉద్యోగుల‌ను 30 టీమ్స్‌గా విభ‌జించింది. 

అనంత‌రం ఒక్కో టీమ్ నుంచి ఇద్ద‌రు వ‌చ్చి 15 నిమిషాల్లో ఎంత లెక్క‌పెడితే ఆ మొత్తం బోన‌స్‌గా తీసుకోవ‌చ్చ‌ని బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో డౌయిన్, వీబో వంటి చైనీస్ సోషల్ మీడియా సైట్‌లలో మొదట ద‌ర్శ‌న‌మిచ్చింది. 

ఆ త‌ర్వాత ఇత‌ర‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోకి రావడంతో ప్ర‌స్తుతం తెగ‌ వైర‌ల్ అవుతోంది. కాగా, ఓ ఉద్యోగి అత్య‌ధికంగా రూ. 12.07 లక్షలు లెక్కించిన‌ట్లు తెలిసింది. ఇక వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 


More Telugu News