UPI Transactions: బీకేర్‌ఫుల్‌.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

These UPI Transactions will be Blocked from February 1 This is the Reason

  • నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు
  • ఇక‌పై యూపీఐ లావాదేవీ ఐడీలో స్పెష‌ల్ క్యారెక్ట‌ర్స్ ఉండకూడ‌దు
  • ఒకవేళ ఉంటే.. నిలిచిపోనున్న‌ అలాంటి యూపీఐ లావాదేవీలు 
  • ఈ విష‌య‌మై ఇప్ప‌టికే యూపీఐ ఆప‌రేట‌ర్స్‌కు ఎన్‌పీసీఐ కీల‌క‌ ఆదేశాలు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కొత్త నిబంధనల ప్రకారం, యూపీఐ లావాదేవీ తాలూకు ఐడీలో స్పెష‌ల్ క్యారెక్ట‌ర్స్ (@, #, &) కలిగి ఉంటే.. అలాంటి యూపీఐ లావాదేవీలు స‌క్సెస్ కావు. ట్రాన్సాక్ష‌న్ ఐడీలో ప్ర‌త్యేక అక్ష‌రాలు లేకుండా ఆల్ఫాన్యూమ‌రిక్ (ఇంగ్లిష్ అక్ష‌రాలు, నంబ‌ర్లు)తోనే ఐడీలు జ‌న‌రేట్ చేయాల‌ని యూపీఐ ఆప‌రేట‌ర్స్‌ను ఇప్ప‌టికే ఎన్‌పీసీఐ ఆదేశించింది. 

ఈ మేర‌కు జనవరి 9న ఓ ప్ర‌త్యేక‌ సర్క్యులర్‌ను జారీ చేసింది. లేనిప‌క్షంలో ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచి ఆయా లావాదేవీలు ఆగిపోతాయ‌ని స్ప‌ష్టం చేసింది. కాగా, ఈ ఆదేశాల‌ను పాటించ‌ని యాప్స్ ద్వారా వినియోగ‌దారులు ట్రాన్సాక్ష‌న్ చేయ‌లేరు. న‌కిలీ ఐడీల‌ను నివారించ‌డంతో పాటు లావాదేవీల‌ను సుల‌భంగా ట్రాక్ చేయ‌డానికే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎన్‌పీసీఐ వెల్ల‌డించింది. 

అంత‌కంత‌కూ పెరుగుతున్న యూపీఐ లావాదేవీలు..
ఇక యూపీఐ లావాదేవీలు రోజురోజుకీ అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఎన్‌పీసీఐ డేటా ప్రకారం యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్‌ సంఖ్య 2024 డిసెంబర్‌లో 16.73 బిలియన్లకు చేరుకుంది. ఇది నవంబర్‌లో 15.48 బిలియన్లతో పోలిస్తే 8 శాతం పెరుగుద‌ల‌ను న‌మోదు చేసింది. 

కాగా, డిసెంబరులో ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.23.25 లక్షల కోట్లకు చేరుకోగా, అంతకు ముందు నెలలో రూ.21.55 లక్షల కోట్లుగా ఉంది. అలాగే రోజువారీ సగటు లావాదేవీల సంఖ్య కూడా నవంబర్‌లో 516.07 మిలియన్ల నుంచి డిసెంబర్‌లో 539.68 మిలియన్లకు పెరిగింది.

  • Loading...

More Telugu News