Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్

Shamshabad Airport Staff Received Threat Call

  • బాంబులతో పేల్చేస్తానంటూ బెదిరించిన దుండగుడు
  • గురువారం తెల్లవారుజామున ఫోన్ కాల్
  • దుండగుడిని కామారెడ్డి జిల్లాకు చెందిన యువకుడిగా గుర్తించి అరెస్టు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఓ దుండగుడు ఫోన్ చేసి విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ భద్రతా సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించి ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు చేపట్టారు. గంటల తరబడి క్షుణ్ణంగా తనిఖీ చేశాక ఎయిర్ పోర్ట్ లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకున్నారు. ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ప్రతి వాహనాన్ని, అరైవల్, డిపార్చర్ ఏరియాలను జల్లెడ పట్టారు. బాంబు స్క్వాడ్ ను రప్పించి క్షుణ్ణంగా గాలించారు.

పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు.. ఫోన్ చేసిన దుండగుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాఫ్తులో కామారెడ్డి జిల్లాకు చెందిన నితిన్ అనే యువకుడు ఈ బెదిరింపు ఫోన్ కాల్ చేశాడని గుర్తించారు. నితిన్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అతడికి మతిస్థిమితం లేదని తేలింది. దీంతో నితిన్ కుటుంబ సభ్యులను పిలిపించి అతడిని అప్పగించారు.

  • Loading...

More Telugu News