Chandrababu: మహాత్మాగాంధీకి నివాళి అర్పించిన చంద్రబాబు

- నేడు మహాత్మాగాంధీ 77వ వర్ధంతి
- అహింసను పరమ ధర్మంగా చెప్పిన మహాత్ముడు అన్న చంద్రబాబు
- ఆయన బోధనలు నేటికీ అనుసరణీయమని వ్యాఖ్య
నేడు మహాత్మాగాంధీ 77వ వర్ధంతి. ఈ సందర్భంగా మహాత్మాగాంధీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ... అహింసను పరమ ధర్మంగా చెప్పిన మహాత్ముడు ప్రాతఃస్మరణీయుడని అన్నారు. ఆయన బోధనలు నేటికీ అనుసరణీయమని చెప్పారు. జాతిపితకు మరొక్కసారి ఘన నివాళి అర్పిస్తున్నానని తెలిపారు.
మరోవైపు గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో ఈ రోజు మాంసం దుకాణాలను బంద్ చేయాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించే దుకాణదారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.