England U19 Vs South Africa U19: విచిత్రమైన ర‌నౌట్‌.. మీరెప్పుడూ ఇలాంటి రనౌట్ చూసి ఉండ‌రు.. ఇదిగో వీడియో!

Batter Gets Run Out In Bizarre Way Fans Call It Unluckiest Dismissal Of 2025

  • ఇంగ్లండ్‌, ద‌క్షిణాఫ్రికా అండ‌ర్‌-19 అనధికారిక టెస్టులో విచిత్ర రనౌట్
  • ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ 
  • బ్యాట‌ర్ కొట్టిన బంతి ఫీల్డ‌ర్ హెల్మెట్‌ను తాకి వికెట్ల‌ను గిరాటేసిన వైనం
  • షాట్ ఆడిన‌ తర్వాత బ్యాటర్ క్రీజ్ వెలుపల ఉండ‌డంతో ర‌నౌట్

ఇంగ్లండ్‌, ద‌క్షిణాఫ్రికా అండ‌ర్‌-19 క్రికెట్‌లో విచిత్ర రనౌట్ చోటుచేసుకుంది. ఇంగ్లండ్ ఆట‌గాడు ఆర్య‌న్ సావంత్ అసాధార‌ణ రీతిలో ఔట‌య్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ జేస‌న్ రౌల్స్ వేసిన బంతిని 19 ఏళ్ల ఆర్యన్ సావంత్ స్వీప్ షాట్ ఆడాడు. దాంతో ఆ బంతి షార్ట్-లెగ్ వద్ద ఉన్న ఫీల్డర్ వ‌ద్దకు వెళ్లి, అక్క‌డే ఫీల్డింగ్ చేస్తున్న జోరిచ్ వాన్ షాల్క్‌విక్ హెల్మెట్‌ను బ‌లంగా తాకి వెన‌క్కి వ‌చ్చి వికెట్ల‌ను గిరాటేసింది. 

ఇక షాట్ ఆడిన‌ తర్వాత బ్యాటర్ క్రీజ్ వెలుపల ఉండ‌డంతో ర‌నౌట్ అయ్యాడు. బంతి బ‌లంగా తాక‌డంతో జోరిచ్ విల‌విల్లాడాడు. ఇంగ్లండ్ అండ‌ర్‌-19, దక్షిణాఫ్రికా అండ‌ర్‌-19 మధ్య జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఇక ఈ విచిత్ర‌మైన ర‌నౌట్ తాలూకు వీడియో చూసిన‌ క్రికెట్ ఫ్యాన్స్ త‌మ‌దైన‌ శైలిలో స్పందిస్తున్నారు. కొంతమంది అభిమానులు దీనిని అరుదైన ఔట్‌గా పేర్కొంటున్నారు. మరికొందరు క్రికెట్ చాలా ప్రమాదకరమైన క్రీడ అని ఈ ఘ‌ట‌న మ‌రోసారి నిరూపించింద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

More Telugu News