ak pradhan: గోదావరి బోర్డు నూతన చైర్మన్‌గా ఎ.కె ప్రధాన్

center appointed ak pradhan as new chairman of godavari river management board

  • కేంద్ర జల సంఘం చైర్మన్‌గా పదోన్నతిపై వెళ్లిన ముఖేశ్ కుమార్ సిన్హా
  • కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ఎకె ప్రధాన్‌కు జీఆర్ఎంబీ చైర్మన్‌గా పదోన్నతి
  • ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ

గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్‌గా ఉన్న ముఖేశ్ కుమార్ సిన్హా కొన్ని రోజుల క్రితం కేంద్ర జల సంఘం చైర్మన్‌గా పదోన్నతిపై నియమితులైన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా ఎకె ప్రధాన్ నియమితులయ్యారు.

ప్రస్తుతం ఆయన కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజినీర్‌గా పని చేస్తుండగా, పదోన్నతిపై బోర్డు చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. 

  • Loading...

More Telugu News