CPI Ramakrishna: ఆయన బండి సంజయ్ కాదు... తొండి సంజయ్: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna fires on Bandi Sanjay

  • గద్దర్ కు పద్మ అవార్డ్ ఎలా వస్తుందని ప్రశ్నించిన బండి సంజయ్
  • ప్రజల పక్షాన పోరాటం చేసిన గొప్ప కళాకారుడు గద్దర్ అన్న సీపీఐ రామకృష్ణ
  • గద్దర్ ఏనాడూ అవార్డులు, పదవుల కోసం చూడలేదని వ్యాఖ్య

గద్దర్ కు 'పద్మ' అవార్డు ఇవ్వాలంటూ కొందరు నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గద్దర్ కు పద్మ అవార్డు ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. నమ్మిన సిద్ధాంతం కోసం బీజేపీ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేశారని... కానీ, నక్సలైట్లతో కలిసి గద్దర్ బీజేపీ కార్యకర్తలను హత్య చేయించారని ఆయన అన్నారు. ఎంతో మంది పోలీసులు, జవాన్లను గద్దర్ చంపారని మండిపడ్డారు.

బండి సంజయ్ వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ ఫైర్ అయ్యారు. ఆయన బండి సంజయ్ కాదు... తొండి సంజయ్ అని విమర్శించారు. పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? లేక బీజేపీ ఇస్తుందా? అని ప్రశ్నించారు. గద్దర్ ఏనాడూ అవార్డుల కోసం, పదవుల కోసం చూడలేదని చెప్పారు. ప్రజల పక్షాన పోరాటం చేసిన గొప్ప కళాకారుడు గద్దర్ అని కొనియాడారు. కుంభమేళాకు యూపీ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని... అక్కడ చోటుచేసుకున్న తొక్కిసలాటపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News