srikalahasti temple: భక్తుడి ఫిర్యాదు.. తీవ్రంగా స్పందించిన లోకేశ్

- శ్రీకాళహస్తి ఆలయంలో ప్రసాదం పంపిణీపై ఎక్స్ వేదికగా ఫిర్యాదు
- భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఏ చర్యను కూడా ఉపేక్షించేది లేదన్న మంత్రి లోకేశ్
- తక్షణమే విచారణ చేసి దానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి
శ్రీకాళహస్తి ఆలయంలో క్యూలైన్‌లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపారన్న ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రసాదం కోసం ఒక భక్తుడు ఎదుర్కొన్న ఇబ్బందిని ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేశ్‌కు ట్యాగ్ చేశాడు.
దీనిపై మంత్రి లోకేశ్ వెంటనే స్పందించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఏ చర్యను కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇంకా కొంతమంది సిబ్బంది వైసీపీ ప్రభుత్వంలోని విధానాల నుంచి ఇంకా బయటకు రాలేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
క్యూ లైన్‌లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపటంపై తక్షణమే విచారణ చేసి, దానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకేశ్ పేర్కొన్నారు. దీనిని దేవాదాయ శాఖ మంత్రికి ట్యాగ్ చేశారు.