Pushpa-2 Stampade: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. ఇప్పటికీ కళ్లు తెరవని బాలుడు

అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ (9) ఇంకా ఆసుపత్రి బెడ్‌పైనే ఉన్నాడు. ఇదే ఘటనలో గాయపడిన బాలుడి తల్లి రేవతి (32) అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన జరిగి 56 రోజులు అయినా శ్రీతేజ్ ఆరోగ్యంలో ఇప్పటికీ ఇసుమంతైనా మార్పు లేదు. నేటికీ కళ్లు తెరిచి చూడలేదు. ఇప్పటికీ సన్నని గొట్టం ద్వారానే ద్రవాహారాన్ని అందిస్తున్నారు.
శ్రీతేజ్ ఎప్పటికి కోలుకుంటాడో వైద్యులు కూడా నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. బాలుడి శరీరంలో ఇతర జీవక్రియలన్నీ సక్రమంగానే జరుగుతున్నా అతడి నుంచి ప్రతిస్పందనలు ఉండటం లేదని కిమ్స్ వైద్యులు నిన్న విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.