Upasana: హ్యాపీ బర్త్ డే నాయనమ్మ... ఉపాసన ఆసక్తికర పోస్టు

- నేడు చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి పుట్టినరోజు
- విషెస్ తెలిపిన ఉపాసన
- స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని కితాబు
మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో మరో ఆసక్తికర పోస్టు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా ఉపాసన శుభాకాంక్షలు తెలిపారు.
"అందరి పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటూ, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే నాయనమ్మకు హ్యాపీ బర్త్ డే. మీతో కలిసి జీవిస్తుండడాన్ని ఇష్టపడుతున్నాం నాయనమ్మ. మేం ప్రతిరోజూ యోగా చేస్తుంటాం... నాయనమ్మ ఇప్పటివరకు ఒక్క యోగా క్లాసు కూడా మిస్ కాలేదు. నిజంగా ఆమె స్ఫూర్తిదాయకమైన వ్యక్తి" అంటూ ఉపాసన కొనియాడారు.
అంతేకాదు, యోగా క్లాసు పూర్తయిన అనంతరం క్లిక్ మనిపించిన ఓ ఫొటోను కూడా ఆమె పంచుకున్నారు. అందులో యోగా డ్రెస్ లో ఉన్న ఉపాసన, అంజనాదేవి చిరునవ్వులు చిందిస్తూ ఉండడం చూడొచ్చు.
