Narendra Modi: కుంభ‌మేళాలో తొక్కిస‌లాట జ‌ర‌గ‌డం బాధాక‌రం.. మృతుల కుటుంబాల‌కు సానుభూతి: ప్ర‌ధాని మోదీ

PM Narendra Modi Tweet on Mahakumbh Mela Stampede

  • ప్ర‌యాగ్‌రాజ్ లో జ‌రుగుతున్న మ‌హా కుంభ‌మేళాలో తొక్కిస‌లాట
  • ఈ ఘ‌ట‌న‌పై 'ఎక్స్' వేదిక‌గా స్పందించిన ప్ర‌ధాని 
  • గాయ‌ప‌డ్డ‌వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించిన మోదీ  

ప్ర‌యాగ్‌రాజ్ లో జ‌రుగుతున్న మ‌హా కుంభ‌మేళాలో తొక్కిస‌లాట జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. ఈ మేర‌కు ప్ర‌ధాని 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలియ‌జేశారు. 

"కుంభ‌మేళాలో తొక్కిస‌లాట జ‌ర‌గ‌డం అత్యంత‌ బాధాక‌రం. ఈ తొక్కిస‌లాట‌లో త‌మ ప్రియ‌మైన వారిని పోగొట్టుకున్న వారి కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ‌ సానుభూతి. గాయ‌ప‌డ్డ‌వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నా. బాధితుల‌ను అన్ని ర‌కాలుగా ఆదుకునేందుకు స్థానిక పాల‌క‌వ‌ర్గం ప‌నిచేస్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌తో నిరంత‌రం మాట్లాడుతున్నా. అక్క‌డి ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నా" అని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు. 

More Telugu News