K Kavitha: వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా?: కవిత

- కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందన్న కవిత
- వేరుశనగ రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలని డిమాండ్
- మార్కెట్ యార్డుల్లో వ్యాపారుల ఆగడాలను అరికట్టాలన్న కవిత
సరైన దిగుబడి లేక ఇబ్బంది పడుతున్న వేరుశనగ రైతులకు గిట్టుబాటు ధర కూడా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశనగ రైతుల ఆందోళన మీకు కనిపించడం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారూ? అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మరోవైపు వ్యాపారుల మోసం వల్ల రైతుల ఆందోళనతో మహబూబ్ నగర్ జిల్లా అట్టుడుకుతోందని అన్నారు.
పోలీసుల పహారా మధ్య వేరుశనగ కొనుగోళ్లు జరపాల్సి వస్తోందని కవిత అన్నారు. కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని చెప్పారు. వ్యాపారులు సిండికేట్ గా మారి తక్కువ ధరకు వేరుశనగను అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం మేల్కొని రైతులకు గిట్టుబాటు ధరను కల్పించడమే కాకుండా... మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు, కమీషన్ దారుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.