prostitution racket: హైదరాబాదులో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహణ.. ముఠా సభ్యుల అరెస్టు

prostitution racket arrested in gowlidoddy at hyderabad

  • గౌలిదొడ్డిలోని రెండు అపార్ట్‌మెంట్‌లో ఎస్ఓటీ పోలీసుల ఆకస్మిక తనిఖీలు
  • విదేశీ యువతులను ట్రాప్ చేసి వ్యభిచారం చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యుల అరెస్టు
  • తొమ్మిది మంది ఆఫ్రికా యువతులను కాపాడిన పోలీసులు

విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని గౌలిదొడ్డిలో రెండు అపార్ట్‌మెంట్‌లో ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. విదేశీ యువతులను ట్రాప్ చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. ముఠా సభ్యులు ఉపాధి పేరుతో ఆఫ్రికన్ యువతులను హైదరాబాద్ రప్పించి బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించుతున్నారు. 

ఈ దాడుల్లో విదేశీ యువతులను ట్రాప్ చేసి వ్యభిచారం చేయిస్తున్న ముఠా సభ్యుల్లో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిది మంది ఆఫ్రికా యువతులను కాపాడారు. ఈ ముఠా సభ్యులు ఆన్‌లైన్ ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

  • Loading...

More Telugu News