Hyderabad Metro: ఆలస్యంగా నడుస్తున్న మెట్రో రైళ్లు.. సాంకేతిక సమస్యే కారణమట

--
హైదరాబాద్ లో మెట్రో సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యం జరుగుతోందని, సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారని మెట్రో అధికారులు తెలిపారు. దీంతో ట్రాఫిక్ చిక్కులు లేకుండా త్వరగా గమ్యం చేరుకోవచ్చని మెట్రోను ఆశ్రయించే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు ఆలస్యమవుతోందని చెబుతున్నారు. అమీర్‌పేట-హైటెక్‌సిటీ, మియాపూర్-అమీర్‌పేట, నాగోల్-సికింద్రాబాద్ మధ్య మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వివరించారు.