bhel: బీహెచ్ఈఎల్ లో భారీగా కొలువులు

notification release for various posts by bhel recruitment

  • బీహెచ్ఈఎల్‌లో 400 జాబ్స్
  • ఇంజినీరింగ్ ట్రైనీలకు రూ.50వేల వేతనం
  • దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 28

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) ఒప్పంద ప్రాతిపదికన 400 ఇంజనీరింగ్ ట్రైనీ, సూపర్‌వైజర్ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 28వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టులు,  వేతనాలు, దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టులు 150, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు 250 ఉన్నాయి. ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్/టెక్నాలజీలో ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించారు. సూపర్ వైజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో రెగ్యులర్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 2025 ఫిబ్రవరి 1 నాటికి 27 సంవత్సరాలు మించని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తు ఫీజు యూఆర్, ఈడబ్ల్యుఎస్, ఓబీసీ అభ్యర్థులు  రూ.1072, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.472లు చెల్లించాలి. సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.32వేలు, ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.50వేలు అందిస్తారు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.   

  • Loading...

More Telugu News