CPM: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ నియామకం

- సంగారెడ్డిలో సీపీఎం రాష్ట్ర మహా సభలు
- మహాసభల్లో జాన్ వెస్లీని కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాల వెల్లడి
- వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన జాన్ వెస్లీ
సీపీఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ నియమితులయ్యారు. ఇప్పటివరకు తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. సంగారెడ్డిలో జరిగిన సీపీఎం రాష్ట్ర మహాసభల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
జాన్ వెస్లీ వనపర్తి జిల్లాలోని అమరచింతకు చెందినవారు. ఆయన గతంలో డీవైఎఫ్ఐ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు జరిగాయి.