Stock Market: పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు

- నిన్న నష్టాలతో వారాన్ని ఆరంభించిన భారత స్టాక్ మార్కెట్
- నేడు లాభాలతో ముగిసిన సూచీలు 592 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- 142 పాయింట్ల వృద్ధి నమోదు చేసిన నిఫ్టీ
- బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల్లో కొనుగోళ్ల అండ
భారత స్టాక్ మార్కెట్ నిన్నటి నష్టాల నుంచి కోలుకుంది. బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల్లో కొనుగోళ్ల అండతో నేడు మార్కెట్ సూచీలు పుంజుకున్నాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 592 పాయింట్లు లాభపడి 75,958 వద్ద ముగిసింది. నిఫ్టీ 142 పాయింట్లు వృద్ధి చెంది 22,972 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ లో 30 మేజర్ షేర్లలో 21 షేర్లు ముందంజ వేయడం నేటి ట్రెండ్‌కు అద్దం పడుతోంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ షేర్లు లాభాల బాటలో పయనించాయి. సన్ ఫార్మా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎల్ అండ్ టీ, నెస్లే ఇండియా షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.