Ramcharan: అవన్నీ పుకార్లే.. రామ్ చరణ్ చేతిలో కేవలం రెండు చిత్రాలే!

- సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గ్లోబల్ స్టార్
- మిక్సడ్ టాక్‌తో సరిపెట్టుకున్న సినిమా
- దీంతో దిల్ రాజుతో మరో చిత్రం చేస్తారని వార్తలు
- కానీ, అవన్నీ పుకార్లేనని చరణ్ టీమ్ వెల్లడి
ఈ సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. చివరికి మిక్సడ్ టాక్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు తన నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్‌వీసీ) బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించిన విషయం తెలిసిందే. కానీ, సినిమా సక్సెస్ కాలేకపోయింది.
దీంతో ఇదే బ్యానర్‌లో చెర్రీ దిల్ రాజు కోసం మరో చిత్రం చేయనున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, తాజాగా ఇవన్నీ పుకార్లేనని చరణ్ టీమ్ తేల్చేసింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. ప్రస్తుతానికి అలాంటి ప్లాన్స్ ఏవీ చరణ్ వద్ద లేవని, ఆయన చేతిలో కేవలం ఆర్‌సీ 16, 17 చిత్రాలు మాత్రమే ఉన్నాయని టీమ్ స్పష్టం చేసింది.
ఇక ఆర్‌సీ 16 తర్వాతి షెడ్యూల్ రేపటి నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని పేర్కొంది. ఇందులో రామ్ చరణ్ సహా ప్రధాన తారాగణం అంతా చిత్రీకరణలో పాల్గొంటారని టీమ్ వెల్లడించింది.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్‌సీ 16' తర్వాత చెర్రీ 'ఆర్‌సీ 17'లో నటించనున్నారు. ఇది ప్రముఖ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కనుంది.