Fatima Sana Shaikh: దక్షిణాదిలో కాస్టింగ్ కౌచ్‌పై ఫాతిమా సనా షేక్ షాకింగ్ కామెంట్స్.. ఆ విష‌యంలో ఇక్క‌డంతా ఓపెన్ అన్న న‌టి!

Fatima Sana Shaikh On Her Casting Couch Experience In South Films

  • అమీర్‌ ఖాన్‌ నటించిన 'దంగల్‌' మూవీతో తెరంగేట్రం చేసిన ఫాతిమా
  • ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌డ‌మ్‌
  • తన కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను పంచుకున్న న‌టి
  • ద‌క్షిణాదిలో నిర్మాత‌లు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఓపెన్‌గా మాట్లాడుకుంటారని వ్యాఖ్య 

బాలీవుడ్‌ నటి ఫాతిమా సనా షేక్ గురించి ప్ర‌త్యేకంగా పరిచ‌యం అక్క‌ర్లేదు. ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయారామె. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మంచి న‌టిగా కూడా గుర్తింపు పొందారు. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ నటించిన 'దంగల్‌' మూవీతో తెరంగేట్రం చేసిన ఫాతిమా.. ఆ త‌ర్వాత కూడా మంచి చిత్రాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకున్నారు. 

అయితే, తన కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో సౌత్‌ ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి కూడా ఫాతిమా షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

ఫాతిమా మాట్లాడుతూ... "నా కెరీర్‌ తొలినాళ్లలో ఒక‌ సినిమా కోసం ఆడిషన్‌కు వెళ్లాను. అక్కడ మీరు ఏం చేయడానికైనా రెడీనా..? అంటూ ఓ ద‌ర్శ‌కుడు నన్ను అడిగాడు. కష్టపడి పనిచేస్తానని.. నా పాత్ర కోసం ఏం కావాలో అది చేస్తానని అత‌నితో చెప్పా. కానీ, అతను మాత్రం అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగాడు. నాకు అత‌ని ఉద్దేశం అర్థ‌మైంది. కానీ, అతడు ఎంతకు దిగజారుతాడో చూద్దామని నేను ఏమీ తెలియనట్లే ప్రవర్తించాను" అని ఫాతిమా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వివ‌రించారు. 

ఇక ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో నిర్మాత‌లు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఓపెన్‌గా మాట్లాడుకుంటారని ఆమె చెప్పారు. ఈ సంద‌ర్భంగా దక్షిణాది సినిమాలో అవకాశం కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తనకు ఎదురైన ఓ అనుభవాన్ని గుర్తు చేశారు. 

హైదరాబాద్‌లో ఓ నిర్మాతను కలిసిన స‌మ‌యంలో అనుభవాన్ని పంచుకుంటూ.."నిర్మాతలు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడుతారు. మీకు తెలుసా.. ఇక్కడ మీరు కొందరిని కలవాల్సి ఉంటుంది అనేవాళ్లు. ఆ విషయం నేరుగా చెప్పేవాళ్లుకాదు. ఎలా చెప్పినా వారి ఉద్దేశమైతే అదే అని తెలిసిపోయేది" అని ఫాతిమా తెలిపారు. దీంతో ప్ర‌స్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట‌ వైరల్‌ అవుతున్నాయి.

కాగా, ఫాతిమా సనా షేక్.. కమల్ హాసన్ హిందీ మూవీ 'చాచీ 420'లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా కనిపించారు. ఆ తర్వాత ‘దంగల్‌’ మూవీతో తెరంగేట్రం చేసిన ఆమె.. 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్', 'లూడో', 'అజీబ్ దాస్తాన్స్', 'థార్', 'సామ్ బహదూర్' వంటి చిత్రాలలో న‌టించి మంచి గుర్తింపు పొందారు.  

  • Loading...

More Telugu News