Nandamuri Balakrishna: 'పద్మ భూషణ్' బాలకృష్ణను ఘనంగా సన్మానించిన అఖండ-2 చిత్రబృందం

Nandamuri Balakrishna felicitated on akhanda 2 sets for the padma bhushan

  • షూటింగ్ సెట్‌లో బాలకృష్ణను సత్కరించి అభినందనలు తెలిపిన అఖండ -2 తాండవం సినీ బృందం
  • పద్మభూషణ్ పురస్కారం పొందిన తర్వాత అఖండ -2 తాండవం షూటింగ్‌లో పాల్గొన్న బాలకృష్ణ
  • కేక్ కట్ చేసి తమ అభినందనలు తెలిపిన చిత్ర బృందం

ఇటీవల కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులలో టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. 

తాజాగా, బాలకృష్ణను అఖండ -2 తాండవం చిత్ర బృందం సెట్‌లో సత్కరించింది. పద్మభూషణ్ పురస్కారం పొందిన అనంతరం బాలకృష్ణ సోమవారం చిత్రీకరణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ సభ్యులు బాలకృష్ణను ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి తమ అభినందనలు తెలియజేశారు.  
 
కాగా, బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ - 2 తాండవం చిత్రం నిర్మాణం ప్రస్తుతం జరుగుతోంది. 2021లో విడుదలైన అఖండ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో ఈ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న అఖండ -2 తాండవంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  

  • Loading...

More Telugu News