Konda Surekha: కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు వైభవంగా నిర్వహిస్తాం: కొండా సురేఖ

- మే 15 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు
- పుష్కరాల నిర్వహణ కోసం రూ.25 కోట్లు మంజూరైనట్లు వెల్లడి
- స్నాన ఘట్టాలు, డ్రైనేజీల నిర్మాణం, రోడ్ల విస్తరణ చేపడతామన్న మంత్రి
కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... సరస్వతీ నది పుష్కరాల నిర్వహణ కోసం పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కాళేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు... 12 రోజుల పాటు పుష్కరాలు నిర్వహిస్తామన్నారు.
పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసిందన్నారు. స్నాన ఘట్టాలు, డ్రైనేజీల నిర్మాణం, రోడ్ల విస్తరణకు ఈ నిధులను వినియోగిస్తామన్నారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.