Stalin: సుప్రీంకోర్టులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట

- సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు
- ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రిట్ పిటిషన్లు
- ఈ రిట్ పిటిషన్ల విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు
తమిళనాడు ఉపముఖ్యమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. గతంలో సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు, హిందువులు ఆయనపై మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ మూడు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ రిట్ పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ఈ పిటిషన్లను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ మేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్నలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను తోసిపుచ్చింది.
సెప్టెంబర్ 2023లో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ... సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్నారు. ఈ వ్యాఖ్యల మీద వ్యతిరేకత రావడంతో... ఉదయనిధి స్పందిస్తూ, ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. అయినప్పటికీ హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది.