Vijayasai Reddy: అయాం హ్యాపీ... ఆసక్తికరమైన ఫొటోలు పంచుకున్న విజయసాయిరెడ్డి

- ఇటీవలే రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డి
- వ్యవసాయమే తన భవిష్యత్తు అని వెల్లడి
- చెప్పినట్టుగానే రంగంలోకి దిగిన వైనం
ఇటీవలే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి... ఇక తన భవిష్యత్తును వ్యవసాయంలోనే చూసుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే విజయసాయి రంగంలోకి దిగారు. తన క్షేత్రంలో వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభించినట్టు వెల్లడించారు.
"నా ఉద్యాన పంటల కార్యకలాపాలను తాజాగా ప్రారంభించానని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను కూడా పంచుకున్నారు. ఓ జీప్, సింపుల్ డ్రెస్ తో వచ్చిన విజయసాయి ఆల్ ఈజ్ వెల్ అనే ఉద్దేశంతో బొటనవేలు పైకెత్తి చూపారు.



