Chandrababu: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో ప్రజల అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

- ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి అభిప్రాయసేకరణ
- 10 అంశాల ప్రాతిపదికన ఐవీఆర్ఎస్, వివిధ రూపాల్లు సర్వే
- అవినీతిపైనా సర్వేలో ఫిర్యాదులు
దావోస్ లో వాణిజ్య పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం చంద్రబాబు మళ్లీ పరిపాలనలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందన్న దానిపై తాజాగా సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల నుంచి సేకరించిన వివరాల మేరకు ఆయా శాఖల పనితీరుపై ఈ సమీక్షలో చర్చించారు.
10 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఐవీఆర్ఎస్, వివిధ రూపాల్లో అభిప్రాయాలు సేకరించారు. సామాజిక పెన్షన్లు, దీపం పథకం, అన్న క్యాంటీన్, ఉచిత ఇసుక సరఫరా, ధాన్యం సేకరణ, ఆసుపత్రులు, దేవాలయాల్లో సేవలపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారాన్ని నేటి సమావేశంలో సమీక్షించారు.
పెన్షన్ల పంపిణీపై 90.2 శాతం మంది లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా గుర్తించారు. ధాన్యం సేకరణలో 89.92 శాతం మంది రైతులు సంతృప్తి చెందినట్టు వెల్లడైంది. దేవాలయాల్లో దర్శనాలపై 70 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేయగా... ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది సేవలపై 35 శాతం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు గుర్తించారు.
ఇక... వివిధ పథకాల్లో ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతిపై సర్వేల్లో ఫిర్యాదులు వచ్చాయి.