Etela Rajender: రియాల్టీ వ్యాపారిని కొట్టిన కేసు.. హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్

- పోచారం పీఎస్ పరిధిలో రియాల్టీ వ్యాపారిని కొట్టిన ఈటల
- కేసు నమోదు చేసిన పోచారం పోలీసులు
- కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఈటల పిటిషన్
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈటల రాజేందర్ ఇటీవల పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయి చేసుకున్న విషయం తెలిసిందే.
ఏకశిలానగర్‌లో సామాన్యుల భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు గూండాలను, కుక్కలను పెట్టి ఏకశిలానగర్ వాసులను బెదిరిస్తున్నారని, ఈ క్రమంలో వారి వద్దకు వెళ్లిన సమయంలో వారి తీరు పట్ల ఆగ్రహంతో చేయి చేసుకున్నట్లు ఈటల ఇదివరకే తెలిపారు.
అయితే రియాల్టీ వ్యాపారిపై దాడి నేపథ్యంలో పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. వాచ్‌మన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు.