Manchu Lakshmi: 'ఇండిగో' తీరుపై మంచు లక్ష్మి మండిపాటు

Manchu Lakshmi Fires on Indigo

  • ఇండిగో విమాన సిబ్బంది త‌న‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌న్న మంచు ల‌క్ష్మి
  • వాళ్లు చెప్పిన విధంగా చేయ‌నిప‌క్షంలో గోవాలోనే త‌న‌ సామగ్రిని వ‌దిలేస్తామ‌ని బెదిరించార‌ని వెల్ల‌డి
  • ఇదొక ర‌క‌మైన వేధింపు అంటూ వాపోయిన న‌టి

ఇండిగో విమాన‌యాన సంస్థ తీరుపై న‌టి మంచు ల‌క్ష్మి మండిప‌డ్డారు. తాజాగా ఆ సంస్థ‌కు చెందిన ఫ్లైట్‌లో ప్ర‌యాణించిన‌ప్పుడు సిబ్బంది త‌న‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించారంటూ త‌న‌కు ఎదురైన ఇబ్బందుల‌ను ఆమె 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా పంచుకున్నారు. గోవాలో తాను ఎక్కిన ఇండిగో 6e585 విమాన సిబ్బంది అత్యంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆమె వాపోయారు.

"నా ల‌గేజీ బ్యాగ్‌ను ప‌క్క‌కు తోసేశారు. బ్యాగ్ ఓపెన్ చేయ‌డానికి కూడా అనుమ‌తించ‌లేదు. వాళ్లు చెప్పిన విధంగా చేయ‌నిప‌క్షంలో గోవాలోనే నా సామగ్రిని వ‌దిలేస్తామ‌ని బెదిరించారు. నాతో సిబ్బంది దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. బ్యాగ్‌కు సెక్యూరిటీ ట్యాగ్ కూడా పెట్ట‌లేదు. ఇదొక ర‌క‌మైన వేధింపు. ఇంకెప్పుడూ ఇండిగో ఎక్కేది లేదు" అని మంచు ల‌క్ష్మి పేర్కొన్నారు. 

More Telugu News