Revanth Reddy: హైదరాబాదులో ఎట్ హోమ్ కార్యక్రమం... హాజరైన సీఎం రేవంత్ రెడ్డి... ఫొటోలు ఇవిగో!

- రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ రాజ్ భవన్ లో ఎట్ హోమ్
- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో తేనీటి విందు
- పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మంద కృష్ణకు సన్మానం
ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాదులోని రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్ పాల్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
ఎట్ హోమ్ కార్యక్రమం సందర్భంగా... ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను సన్మానించారు. మంద కృష్ణకు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల ఆయనను అభినందించారు.












